ఏపీ మంత్రులకి తప్పిన పెను ప్రమాదం

-

ఆంధ్రప్రదేశ్ మంత్రులకు పెను ప్రమాదం తప్పింది. ఈ రోజు నెల్లూరు జిల్లా డి సి పల్లి టోల్ ప్లాజా వద్ద ఇద్దరు మంత్రుల కాన్వాయ్ కి ప్రమాదం చోటు చేసుకుంది. మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, అలానే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ల కాన్వాయ్ కి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్ లోని మొదటి వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఒక దానికి ఒకటి వరుసగా మూడు వాహనాలు డీకొనడంతో అవన్నీ ధ్వంసం అయ్యాయి.

ఈ రోజు కృష్ణాపురం వద్ద హైలెవల్ కెనాల్ ఫేజ్ టూ ప్రారంభోత్సవానికి మంత్రులు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్ – 2 నిర్మాణ పనులకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ముఖ్యమంత్రి జగన్ నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాప‌న చేయ‌నున్నారు. 650 కోట్ల వ్య‌యంతో ఈ ప్రాజెక్టును చేప‌ట్ట‌బోతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్త‌యితే ఆత్మ‌కూరు, ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గాల్లోని మెట్ట‌ప్రాంతాలు స‌స్య‌శ్యామ‌లం అవడంతో పాటు తాగు నీటి అవ‌స‌రాలు కూడా తీరుతాయ‌ని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version