బ్రేకింగ్: పదవి నుంచి తప్పుకోనున్న రష్యా అధ్యక్షుడు

-

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పార్కిన్సన్స్ వ్యాధి ఉందనే ఊహాగానాల నేపధ్యంలో వ్లాదిమిర్ పుతిన్ వచ్చే ఏడాది జనవరిలో వైదొలగాలని యోచిస్తున్నట్లు ఒక నివేదిక పేర్కొంది. మీడియాలో వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే… వ్లాదిమిర్ పుతిన్ (68) ఆరోగ్య సమస్యల కారణంగా పదవీ విరమణ చేయాలని ఆయన కుటుంబం కోరింది. పుతిన్ 37 ఏళ్ల ప్రేయసి, అలీనా కబెవా మరియు ఆయన ఇద్దరు కుమార్తెలు ఆయనను పదవిని విడిచిపెట్టాలని ఒత్తిడి చేస్తున్నారని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది.

 

ఆయనకు ఒక కుటుంబం ఉంది అని… ఆ విషయాన్ని ఆయన గుర్తు పెట్టుకుని ముందుకు వెళ్ళాలి అని, ఆయన జనవరిలో తన పదవి నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నారని రష్యా రాజకీయ నాయకుడు ఒకరు పేర్కొన్నారు. పుతిన్ పార్కిన్సన్‌ తో బాధపడుతున్నారని ఇటీవల ఈ వ్యాధి లక్షణాలు ఆయనలో కనిపించాయని పేర్కొన్నారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, పుతిన్ త్వరలో ఒక కొత్త ప్రధానమంత్రిని నియమిస్తారని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version