ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల పై సర్వేలు చెబుతుంది ఇదే

-

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి పెరుగుతోంది. ప్రచారంలో ప్రధాన పార్టీల నేతలు నిమగ్నమవుతున్నారు. ఇప్పటికే సుడిగాలి పర్యటనలు మొదలుపెట్టారు. అయితే ఐదు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల తాజా పరిస్థితిపై ఏబీపీ సీ – ఓటర్ ఓపీనియన్ పోల్ నిర్వహించింది. బెంగాల్‌ రాష్ట్రంలో మరోసారి మమతదే అధికారం అని ఓపినియన్‌ పోల్‌లో తేలింది. అలాగే కేరళలో వామపక్ష కూటమి అధికారాన్ని నిలబెట్టుకోనుంది. అసోంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని… తేలింది. పుదుచ్చేరిలోనూ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశముందని సీ ఓటర్ సర్వేలో తేలింది.

రాష్ట్రాల వారీగా చూస్తే పశ్చిమబెంగాల్‌ లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ 148 నుంచి 164 సీట్లు సాధించి మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్‌ కొట్టే అవకాశం ఉందని సీ ఓటర్ సర్వే తేల్చింది. బీజేపీకి 92 నుంచి 108 సీట్ల దాకా వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్-వామపక్ష కూటమికి 31-39 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక తమిళనాడులో అధికార అన్నాడీఎంకేకు ఎదురుదెబ్బ తగలనుంది ఓపినియన్ పోల్ తేల్చింది. అన్నాడీఎంకే కూటమి కేవలం 58నుంచి 66 సీట్లు మాత్రమే వచ్చే అవకాశముంది.

తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని యూపీఏ కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకోనుంది. ఈ కూటమీకి 154నుంచి 162 మధ్య సీట్లు వచ్చే అవకాశముంది. కమల్‌ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ పార్టీకి 2నుంచి 6 సీట్లు వచ్చే అవకాశముందని సీఓటర్ తేల్చింది. ఇక కేరళలో వామపక్ష కూటమి మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ -ఎల్డీఎఫ్ కు 83 నుంచి 91 సీట్లు వచ్చే చాన్స్‌ ఉందని తేల్చింది. నేతృత్వంలోని యూడీఎఫ్ కు 47-55 సీట్లు వచ్చే అవకాశం ఉంది. కేరళలో బీజేపీకి కేవలం 2 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది.

ఇక ఆసోంలో ఎన్డీఏ కూటమి 43 శాతం ఓట్లతో అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 72సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీయే కూటమి 47 సీట్లు దక్కించుకునే అవకాశం ఉంది. పుదుచ్చేరిలో ఈసారి కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తప్పేలాలేదు. అక్కడ 17 నుంచి 21 సీట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ కు ఈసారి 12లోపు సీట్లకే పరిమితమయ్యే అవకాశం ఉందని ఏబీపీ సీ ఓటర్ సర్వే తేల్చింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version