ఆచార్య టాక్ : చెర్రీ హైలెట్.. చిరు వైబ్రెంట్.. ఫ‌స్ట్ రివ్యూ ఇదే !

-

మొద‌ట్నుంచి అనుకున్న విధంగానే రామ్ చ‌ర‌ణ్ కోసం మార్చి రాసిన క‌థ‌లో చిరు ఎంట్రీ ఇచ్చారా లేదా చిరును ఉద్దేశించి చేసిన క‌థ‌లో మార్పుల‌కు అనుగుణంగా రామ్ చ‌ర‌ణ్ మ‌రింతగా ఎలివేట్ అయ్యాడా ! ఈ సినిమా కూడా చెర్రీ కెరియ‌ర్ కు ప్ల‌స్ .. ట్రిపుల్ ఆర్ హ‌వాలో ఉన్న చెర్రీకి ఓ విధంగా డ‌బుల్ కాదు ట్రిపుల్ బొనాంజా ! బాక్సాఫీసు వ‌ద్ద రికార్డుల మోత మొద‌ల‌యితే ఇక ఆగ‌దు. ఒక్క మాట‌లో చెప్పాలంటే అభిమానుల మాట ప్ర‌కారం చెప్పాలంటే ధ‌ర్మ‌మే గెలిచింది. గెలుస్తుంది కూడా !

ధ‌ర్మో ర‌క్ష‌తి ర‌క్షితః

తండ్రిని మించిన త‌న‌యుడు అనే మాట ఈ సినిమాతో మ‌రోసారి రుజువు కానుంది. ఈ సినిమా స్థాయిని పెంచింది రామ్ చ‌ర‌ణ్ మాత్ర‌మే ! ఆయ‌న వెనుక ఓ నీడ ఓ తిరుగులేని తేజం చిరు. ఎప్ప‌టి నుంచో ఆ ఇద్ద‌రి క‌ల ఆచార్య. ముందుగా అనుకుని చేసిన సినిమా కాక‌పోయినా, క‌థ‌లో చేసిన మార్పుల కార‌ణంగా ఈ సినిమా స్కేల్ పెరిగింది. చిరుకు మాత్ర‌మే అన్న క‌థ కాస్త చెర్రీ వైపు సాగింది. ఇప్పుడు ఆచార్య క‌థ‌లోకి చిరు వ‌చ్చాడు. అని చెప్ప‌డం మెగాస్టార్ కే సాధ్యం. సిద్ధా పాత్ర‌తో చెర్రీ స్థాయిని మ‌రింత పెంచారు కొర‌టాల. అన‌వ‌స‌ర‌పు క్యారెక్ట‌ర్ ఎలివేష‌న్స్ క‌న్నా క‌థ‌కు అనుగుణంగా వేరియేష‌న్స్ ఉండే విధంగానే స్క్రిప్ట్ డెవ‌ల‌ప్మెంట్ కే ఎక్కువ ఆస‌క్తి చూపించారు. ఆ విధంగా ఆచార్య విష‌యంలో ఆయ‌న ఇద్ద‌రు మెగాస్టార్ల‌ను డైరెక్ట్ చేశారు. తీవ్ర ఒత్తిడిని దాటి వ‌చ్చారు.

హిట్టే త‌ప్ప ఫ్లాప్ తెలియ‌దు

మెగా అభిమానులతో పాటు యావత్ తెలుగు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆచార్య..మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ చిత్రం పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి..తండ్రీ కొడుకులు ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో సినిమా కలెక్షన్స్ కూడా అంతకు మించి ఉంటాయ‌ని ట్రేడ్ వ‌ర్గాల వారు అభిప్రాయ పడుతున్నారు..తన కెరియ‌ర్లో ఇప్పటి వరకు సూపర్ హిట్లే తప్పితే… ఫ్లాప్ ఎరుగ‌ని దర్శకుడిగా ఉన్న కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ అంచనాలు మరింత‌గా పెరిగాయి..ఏదేయితేనేం ఎన్నో మ‌హ‌మ్మారులు దాటుకుని, విఘ్నాలు దాటుకుని, అవ‌రోధాలు జ‌యించి, శ‌క్తిని రెట్టింపు చేసుకుని ఈ రోజు మొత్తానికి థియేటర్లలోకి వచ్చేసింది.

యాక్ష‌న్ డోస్ తగ్గిస్తే బాగుండు

ఇప్పటికే ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఓవర్సీస్ రివ్యూ సూపర్ గా ఉంది. చిరంజీవి, రామ్ చరణ్ పవర్ ప్యాక్డ్ పెర్ఫామెన్స్ ఇచ్చినట్లుగా రివ్యూలు వస్తున్నాయి. ఉమైర్ సంధు ఆచార్య మూవీకి ఫోర్ స్టార్ రేటింగ్ ఇచ్చాడు. ఇప్పటికే విడుదలై ప‌లు చోట్ల ప్ర‌దర్శ‌న పూర్తి చేసుకున్న ఈ సినిమాకు అభిమానుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. రామ్ చరణ్, చిరంజీవి క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకోవ‌డంతో యాక్షన్ సీక్వెన్స్‌లు, డ్యాన్సులు మరింత ఆకట్టుకున్నాయ‌ని అంటున్నారు. యాక్ష‌న్ డోసు త‌గ్గిస్తే ఇంకా బాగుండేది అన్న అభిప్రాయం కూడా మ‌రో వైపు వినిపిస్తోంది.

కొరటాల మార్క్ డైలాగ్స్, డైరెక్షన్ సినిమాను మరో రేంజ్ కు తీసుకెళ్లాయి. రామ్ చరణ్, పూజా హెగ్డే మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా ‘ ఆచార్య’కు ప్లస్ కానున్నాయి. ఏదేయితేనేం మొదటి షో పడగానే బొమ్మ అదుర్స్ అనిపించుకుంది. కలెక్షన్స్ పరంగా దూసుకుపోనుంది..కానీ సినిమా స్టోరీ పరంగా ఇంకాస్త బెట‌ర్ వే లో ఉంటే బాగుండు అన్న వాద‌న స‌గ‌టు ప్రేక్షకుల నుంచి వ‌స్తున్న వాద‌న‌. కొరటాల శివ‌ను అభిమానించే వారి అభిప్రాయం కూడా ! దీనిపై చిత్ర రూప‌క‌ర్త‌లు ఏమంటారో చూద్దాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version