ఒకరి కష్టం తన కష్టం.. ఒకరి వేదన తన వేదన.. అవును ! భారం మోసిన వాడు దేవుడు.. బాధ్యత తీసుకున్నవాడు నిజమైన సేవకుడు. ప్రజా సేవకుడు. ఈ సినిమా కొన్ని మంచి విషయాల మేళవింపు. సామాజిక బాధ్యతతో వస్తున్న సినిమా కనుక ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. నాయకులు కూడా ఆలోచించాలి. ధర్మ పరిరక్షణే ప్రధాన ధ్యేయం కావాలి.
కొన్నే కలలు మాట్లాడతాయి.. కొన్నే కలలు నిజం అవుతాయి.. కొన్నే కలలు కొత్త రంగులు పూసుకుని సెల్యులాయిడ్ వండర్స్ అవుతాయి. ఆ కోవలో ఆ తోవలో ఆచార్య ఓ సెల్యులాయిడ్ వండర్ కానుంది. ఆ సినిమాలో కనిపించే ధర్మస్థలి ఎన్నో ప్రత్యేకతలకు ఆనవాలు. ఆ కథ ఎన్నో విశిష్టతలకు ఆనవాలు. రావయ్యా చిరు ! మీ కోసం వెయిటింగ్ ఇక్కడ మీ ఫ్యాన్స్ మరియు మేము..
రాముడు..జీసస్..బుద్ధుడు..వివేకానందుడు..ఈ నలుగురు నడయాడిన నేల.. వాళ్లే ఆయన కథల్లోనూ నడయాడారు. అందుకే రేపటి వేళ ఆచార్య కూడా మనకో వివేకానందుడు..మనకో బుద్ధుడు.. కావొచ్చు. రామ్ చరణ్ ఎంతో గొప్పగా చెప్పిన మాటలు ఇవి. అవును ! ఓ సూపర్ సోల్ మాత్రమే మనతో మాట్లాడితే ఎలా ఉంటుందో అదే నా సినిమా అని చెప్పకనే చెబుతున్నారు కొరటాల.
అది 2019 గాంధీ జయంతి. అన్నయ్య డ్రీమ్.. సైరా నరసింహా రెడ్డి. సురేందర్ రెడ్డి అలియాస్ సూరీ డైరెక్ట్ చేసిన ఆ సినిమా ఎన్నో సంచలనాలకు కేరఫ్ అయింది.ఆ రోజు తరువాత అన్నయ్య సినిమా థియేటర్లకు రాలేదు. కరోనా కారణంగా 2ఏళ్లకు పైగా ఆయన ఆగిపోయారు. సినిమా స్క్రిప్ట్ దశ నుంచి పరిగణిస్తే మొత్తం నాలుగేళ్ల కాలాన్ని ఈ సినిమాకే వెచ్చించారు. స్క్రీప్ట్ దశలో కొన్ని మార్పులు అనివార్యమై చేశారు. రాం చరణ్ పాత్రను పెంచి పెద్దది చేశారు.
ఆ విధంగా ఆ పాత్రలో కనిపించే విభిన్న పార్శ్వాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి అని చెబుతున్నాడు చిరు. నా పాత్ర కన్నా సిద్ధా బాగుంటాడు అని చెబుతున్నాడు చిరు. ఏ విధంగా చూసుకున్నా ఈ సినిమా సురేఖ డ్రీమ్.. ఇంకా చెప్పాలంటే తండ్రీ కొడుకులద్దరి డ్రీమ్. కొరటాల శివలాంటి సాఫ్ట్ నేచుర్డ్ డైరెక్టర్ చెప్పదగ్గ కథ ఇది. ఎంతో బాధ్యత ఉన్న కథ ఇది. అందుకే అంటున్నాం.. ఇదొక తుఫాను.. ఇదొక ప్రభంజనం కూడా !
ఈ నేపథ్యాన మరికొద్ది గంటలలో తుఫాను రానుంది. మెగా తుఫాను రానుంది. అందరినీ అలరించే తుఫాను ఇది. ఎవ్వరినీ గాయ పెట్టని తుఫాను ఇది. సంచలనాలను నమోదు చేసి వెళ్లే తుఫాను ఇది. అన్నయ్య వస్తున్నాడ్రా ! థియేటర్ల దగ్గర పూనకాలే ! ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న అభిమానులకు ఈ సినిమా ఐ ఫీస్ట్. కొరటాల శివ అనే ఓ సాఫ్ట్ నేచుర్డ్ డైరెక్టర్ చేస్తున్న విజువల్ వండర్ ఇది.