ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకి మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. బొత్సకి కౌంటర్ గా అచ్చెన్న ఓ ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ప్రారంభానికి ముందే వైసీపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ట్విట్టర్ వేదికగా కీలక డిమాండ్ చేశారు. “విభజన సమస్యల పరిష్కారానికి ఇవాళ 2 రాష్ట్రాల సీఎంల సమావేశం నేపథ్యంలో పోర్టుల్లో, టీటీడీ ఆస్తుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటాలు కోరుతున్నట్టుగా వస్తున్న వార్తలు AP ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి పారదర్శకతకోసం, ప్రజలకు వాస్తవాలు తెలియడానికి ముఖ్యమంత్రుల సమావేశాన్ని ప్రత్యక్షప్రసారం చేస్తే బాగుంటుందని నా సూచన. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారని భావిస్తున్నాను” అని బొత్స ట్వీట్ చేశారు.
దీనికి కౌంటర గా భలే జోకులేస్తున్నారు బొత్స గారు..! పారదర్శకత గురించి మీరు.. జగన్ మాట్లాడితే నవ్విపోతారు.. వద్దులెండీ..? పారదర్శకతకు పాతరేసిందే మీరు.. మీ పార్టీ. ప్రెస్ మీట్లు కూడా లైవ్ కాకుండా ఎడిట్ చేసి ఇవ్వాలని ఆదేశించే నాయకత్వంలో మీరు పని చేస్తున్నారు. దయచేసి పారదర్శకత.. వాస్తవాలు వంటి పెద్ద పెద్ద పదాలు మీరు వాడొద్దు.ప్రజలకు అన్ని విషయాలు తెలుసు..సమావేశమయ్యాక.. అన్ని తెలుస్తాయి అని ట్వీట్ చేశారు అచ్చెన్నాయుడు.