మహిళకు సిజేరియన్ డెలివరీ సందర్భంగా శిశువు జననాంగాలను డాక్టర్ కత్తిరించాడు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం విషమించడంతో ఆ పసిబిడ్డ మరణించాడు. దీంతో పేరెంట్స్, బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి శిశువు మరణానికి కారణమైన ఆ డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలోని దావనాగ్రే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూన్ 17న నెలలు నిండిన అమృత, ప్రసవం కోసం చిగటేరి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యింది. సాధారణ డెలివరీ సాధ్యం కాదన్న డాక్టర్లు ఆమెకు సిజేరియన్ చేయాలని చెప్పారు.
అమృతకు సిజేరియన్ డెలివరీ సందర్భంగా డాక్టర్ పొరపాటున నవజాత శిశువు ప్రైవేట్ భాగాన్ని కత్తిరించాడు. ఈ నేపథ్యంలో పసిబాబు ఆరోగ్యం విషమించడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో అమృత కుటుంబ సభ్యులు ఆ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. డాక్టర్ నిజాముద్దీన్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తమ బిడ్డ చనిపోయినట్లు అమృత, ఆమె భర్త అర్జున్ ఆరోపించారు. ఆ డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.