నో కామెంట్: ప్రజాస్వామ్య అవహేళన.. శుక్రవారం.. ఏ-2.. ఈఎస్ఐ!

-

కొన్ని విషయాలు యాధృచ్చికంగా జరిగినా భలే విచిత్రంగా ఉంటాయి. పైగా జగన్ కు సంబందించిన విషయాల్లో మరీ యాధృచ్చికంగా ఉంటుంటాయి. నాడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైపాకా నుంచి అధికార టీడీపీ 23మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి నేరుగా కండువాలు కప్పి మరీ తీసుకున్న సంగతి తెలిసిందే. వారిలో నలుగురికి మంత్రిపదవులు కూడా ఇచ్చిన బాబు.. ప్రజాస్వామ్యాన్ని, ప్రజాభిప్రాయాన్ని అవహేళన చేశారు. అనంతరం చిత్రంగా… 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు 23 సీట్లే వచ్చాయి. మళ్లీ దాదాపు అలాంటి సంఘటనే ఒకటి జరిగింది.

జగన్ ను వ్యక్తిగతంగా విమర్శించడంలో ముందుండే తెలుగుదేశం నేతల్లో ఒకరైన అచ్చెన్నాయుడు… ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే జగన్… శుక్రవారం జగన్.. ఏ-1 జగన్ అంటూ విమర్శలు చేసేవారు. మరికొన్ని సందర్భాల్లో జగన్ పేరు కూడా ప్రస్థావించకుండా “ఏ-1” అని మాత్రమే అనేవారు కూడా. మళ్లీ అలాంటి యాదృఛ్చిక సంఘటనే ఇంకోటి జరిగింది. సరిగ్గా శుక్రవారం నాడే అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యారు… ఈఎస్ఐ స్కాం లో ఆయన్ని ఏ-2 గా పెట్టారు!

ఇక్కడ మరో యాధృచ్చిక సంఘటన ఏమిటంటే… ఏ ఈఎస్‌ఐ స్కాం లో అచ్చెన్నాయుడు అరెస్ట్‌ అయ్యారో… సరిగ్గా అదే ఈఎస్‌ఐ ఆసుపత్రిలోనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిని కోవిడ్‌ పరీక్షలకు కేటాయించడంతో ఇతర వైద్య సేవలను ఈఎస్‌ఐ ఆసుపత్రిలో నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version