ఏ సినిమాకైనా ప్రణాళిక చాలా ముఖ్యం. కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి గుమ్మడికాయ కొట్టి థియోటర్స్ లో బొమ్మ పడే వరకు అనుకున్న ప్లాన్స్ లో ఎలాంటి అవాంతరాలు రాకపోతే నిర్మాతలు చాలా వరకు గట్టెక్కేస్తారు. లాభాల విషయం పక్కన పెడితే మంచి సినిమా అన్న టాక్ గాని జనాలలో బజ్ గాని క్రియోట్ అయితే పెట్టిన పెట్టుబడి పెట్టినట్టు చాలా ఈజీగా వెనక్కి వచ్చేస్తుంది. కాని పొరపాటున ఒక్క పది రోజులు ఇతర కారణాల వల్ల గనక షూటింగ్ పెరిగితే ఆ పది రోజుల ఖర్చు ఎలా రాబట్టాలన్న ఆలోచనే నిర్మాతలకి మనసులో ఎక్కువగా ఉంటుంది.
అలాంటిది నెలలకు నెలకు పోస్ట్‌పోన్ అవుతూ ఉంటే ఇక ఆ సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే గనక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ అయితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఎవరైనా ఊహిస్తారా ..అలాంటి పరిణామాలే నిజంగా ఆర్ ఆర్ ఆర్ కి ఎదురవుతున్నాయట. మెగా పవర్ స్టార్ రాం చరణ్ ..యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోలుగా తయారవుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమా ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. వాస్తవంగా అయితే ఈ సమ్మర్ లో రిలీజ్ చేయాలనుకున్నది 2021 సంక్రాంతికి పోస్ట్ పోన్ అయింది. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి స్వయంగా వెల్లడించారు.
ఇలా దాదాపు ఆరు నెలలు పోస్ట్ పోన్ అయితేనే కోట్లలో నష్టం జరుగుతుందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు కరోనాతో నెలకొన్న దారుణమైన పరిస్థితులను బట్టి చూస్తుంటే 2021 సంక్రాంతికి కూడా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే సూచనలు కనిపించడం లేదని అంటున్నారు. దాంతో ఇప్పటికే భారీగా పొరిగిపోతున్న ఈ సినిమా బడ్జెట్ మరింత పెరగే అవకాశాలున్నాయట. దీంతో ఆర్ ఆర్ ఆర్ మేకర్స్ టెన్షన్ పడుతున్నట్టు ఫిల్మ్ నగర్ లో వార్తలు వస్తున్నాయి. ఒకేసారి చుట్టుముట్టిన కష్టాల నుంచి ఆర్ ఆర్ ఆర్ బయట పడుతుందా అని మాట్లాడుకుంటున్నారు.