చంద్రబాబు… పున్నమి చంద్రుడు: అచ్చెన్నాయుడు

-

స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ కాబడిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోసం టీడీపీ నేతలు మరియు అభిమానులు తమ బాధను తెలియచేస్తున్నారు. కోర్ట్ లలో సరైన తీపులు కోసం ఎదురుచూస్తున్నారు, కాగా తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈయన మాట్లాడుతూ ఈ రాష్ట్రము యొక్క అభివృద్ధి కోసం మరియు ప్రజల బాగు కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహానాయకుడు చంద్రబాబు అన్నారు. నిజాయితీగా రాజకీయాలు చేసిన కొంతమంది అరుదైన నాయకులలో చంద్రబాబు మొదటి స్థానంలో ఉంటారంటూ ఆకాశానికి ఎత్తేశాడు అచ్చెన్నాయుడు. ఈయన అవినీతి అంటే ఏమిటో తెలియని అమాయకుడని, నిజాయితీకి మరో పేరంటూ అచ్చెన్నాయుడు చంద్రబాబును పున్నమి చంద్రుడు అంటూ పొగిడారు.

ఇప్పటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేసి నెలరోజులు కావస్తున్నా ఇప్పటి వరకు కనీసం ఒక్క ఆధారం కూడా బయటకు తీసుకురాలేకపోయారు అంటూ సిఐడి పై కామెంట్ లు చేశారు అచ్చెన్నాయుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version