పాలస్తీనా – ఇజ్రాయెల్ యుద్ధం: ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం !

-

ప్రస్తుతం ఆధిపత్య కారణాల వలన పాలస్తీనా మరియు ఇజ్రాయెల్ లాంటి పక్క పక్కన ఉన్న దేశాల మధ్యన యుద్ధం స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధం కారణంగా ఇప్పటి వరకు అమాయకులైన 201 మంది రెండు దేశాలలో కలిపి మరణించినట్లు తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ దేశానికి విమానాలను నడుపుతున్న ప్రముఖ సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. మాములు రోజులలో ఎయిర్ ఇండియా సంస్థ విమానాలను దేశ రాజధాని ఢిల్లీ నుండి ఇజ్రాయెల్ లోని ప్రధాన నగరమైన టెల్ అవైవ్ కు నడుపుతూ ఉండేది. కానీ ఈ పరిస్థితిలో ప్రయాణికుల రక్షణను మరియు భద్రత సిబ్బంది రక్షణ దృష్టిలో ఉంచుకుని రాకపోకలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ యుద్ధం వలన ఎటువంటి ఉపయోగం ఉండదని కొంతకాలం ముందు రష్యా మరియు యుక్రెయిన్ ల మధ్య జరిగిన యుద్ధం ద్వారా అందరికీ ప్రూవ్ అయింది. కాగా ఈ యుద్ధం ఎప్పుడు ఆగనుంది అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version