ఏపీ టీడీపీ అధ్యక్ష్యుడిగా టెక్కలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొత్త కమిటీల విషయంగా చంద్రబాబు కసరత్తు పూర్తి చేసినట్టు చెబుతున్నారు. అయితే ఈ ప్రచారం చాలా రోజుల నుండీ జరుగుతోన్నా అచ్చెన్న అరెస్ట్ తర్వాత ఆ ప్రచారం పూర్తిగా ఆగిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ మేరకు మీడియాకి లీకులు ఇచ్చింది టీడీపీ.
ప్రస్తుతం అధ్యక్ష్యుడిగా శ్రీకాకుళం జిల్లాకి చెందిన కళా వెంకట్రావు ఉన్నారు. ఆయన సరిగా ప్రభుత్వం మీద పోరాడడం లేదని శ్రేణుల భావన. అదే అచ్చేన్నాయుడు అయితే ఈ పదవికి సరిగా సూట్ అవుతారని, అధ్యక్ష్య పదవి లాంటిది ఇస్తే మరింత ఎక్కువగా ప్రభుత్వంతో ఆయన పోరాడడానికి ఉంటుందని అంటున్నారు. దీని మీద త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది.