జనవరి 13 నుంచి పరేడ్ గ్రౌండ్స్ లో కైట్ & స్వీట్ ఫెస్టివల్ : జూపల్లి కృష్ణారావు

-

పరేడ్ గ్రౌండ్స్ లో కైట్ & స్వీట్ ఫెస్టివల్ ఉంటుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో జనవరి 13 నుండి 15 వరకు అంతర్జాతీయ కైట్ & స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని ప్రకటించారు జూపల్లి కృష్ణారావు. ఇండోనేషియా, స్వీడన్, ఆస్ట్రేలియా, శ్రీలంక, కెనడా, కంబోడియా, థాయిలాండ్, ధక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, ఇటలీ, దక్షిణాఫ్రికా, జపాస్ ట్యునీషియా, పోలాండ్, సింగాపూర్, ఉక్రెయిస్, ఫ్రాన్స్ వంటి 19 విదేశాల నుండి నైపుణ్యం గల 47 మంది అంతర్జాతీయ కైట్ ప్లైయర్స్, 14 రాష్ట్రాల నుండి 54 మంది జాతీయ కైట్ ప్లైయర్స్ ఈ పండుగలో పాల్గొంటారు.

jupally

జనవరి 13, 14, 15వ తేదీల్లో గాలిపటాలను ప్రత్యేకంగా రాత్రి వేళ ఎగురవేసే కార్యక్రమం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించబడుతుంది. ఇక్కడ వివిధ రాష్ట్రాలు, దేశాలకు చెందిన వారు 2024లో పెద్ద సంఖ్యలో పాల్గొని 1000 కంటే ఎక్కువ రుచికరమైన స్వీట్లను తయారు చేసి ప్రదర్శించారని గుర్తు చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు.. ఇది ప్రపంచవ్యాప్తంగా పర్యాటకాన్ని ప్రోత్సహించింది సుమారు 15,00,000 ఫ్లోటింగ్ సందర్శకులు ఈ కార్యక్రమాన్ని చూశారని ప్రకటన చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు..

Read more RELATED
Recommended to you

Exit mobile version