రోగులను వదిలేసి బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న ఆసుపత్రి సిబ్బంది..!

-

సాధారణంగా ఆసుపత్రి అంటే దేవాలయం లాంటిది అని చెబుతుంటారు. ముఖ్యంగా ప్రాణాలు కాపాడే వైద్యులను దేవుళ్లుగా భావిస్తుంటారు. కానీ కొంత మంది సిబ్బంది వల్ల మంచి డాక్టర్లు, నర్సులు సిబ్బంది, ఏకంగా ఆసుపత్రికే చెడ్డ పేరు తీసుకొస్తుంటారు. ఇలాంటి ఘటనలు ఎక్కువగా చాలా వరకు ప్రభుత్వ ఆసుపత్రులలోనే ఎక్కువగా చోటు చేసుకుంటాయి. తాజాగా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

రోగులను వదిలేసి బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు ఆసుపత్రి సిబ్బంది. అటెండర్స్ లేకపోవడంతో రోగిని భుజంపై ఏడో అంతస్తు వరకు మోసుకు వెళ్లాడు రోగి భర్త. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను వదిలేసి, ఆసుపత్రి సూపర్డెంట్ ప్రతిమ రాజ్ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు రేడియాలజీ సిబ్బంది, మెడికల్ స్టాఫ్ మొత్తం. ఫిట్స్ తో ఆస్పత్రికి వచ్చిన లక్ష్మీ అనే మహిళను వైద్యం చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్లారు సిబ్బంది. డ్యూటీ ఎగ్గొట్టి బర్త్ డే వేడుకల్లో పాల్గొనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రోగులు. ఆస్పత్రి ఎదుట రోగుల బంధువుల ఆందోళన చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version