అప్పు కట్టలేదని.. మహిళపై యాసిడ్ దాడి

-

రోజు రోజుకు మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. కృష్ణా జిల్లాలో ఓ మహిళపై యాసిడ్ దాడి జరిగింది. కృష్ణా జిల్లా పెడనలో తీసుకున్న అప్పు కట్టలేదని రామలక్ష్మి కాలనీకి చెందిన కరుణ కుమారి అనే మహిళపై రాముడు అనే వ్యక్తి యాసిడ్ దాడి చేయడం కలకలం రేపింది. కుటుంబ అవసరాల నిమిత్తం రాముడు అనే వ్యక్తి వద్ద కరుణ కుమారి 5 రుపాయల వడ్డీకి రూ.20 వేలు అప్పుగా తీసుకుంది. బాకీ తీర్చడం ఆలస్యం కావడంతో కొన్ని నెలల నుండి రాముడు తనను వేదింపులకు గురి చేస్తున్నాడని కరుణ కుమారి ఆవేదన వ్యక్తం చేస్తోంది. కరుణ కుమారి భర్త ఇంట్లో లేని సమయంలో రాముడు యాసిడ్​తో దాడి చేశాడు. యాసిడ్ దాడి జరగడంతో కరుణ కుమారి బిగ్గరగా కేకలు వేసింది. ఇది విని స్థానికులు అక్కడకు వచ్చే సరికి రాముడు పరారయ్యాడు. చికిత్స నిమిత్తం కరుణ కుమారిని పోలీసులు మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

విజయవాడ పెడనలో దారుణం జరిగింది. 20వ వార్డులోని రామలక్ష్మి కాలనీలో మోకా కరుణ కుమారిపై ఓ వ్యక్తి యాసిడ్ తో దాడి చేశారు. ఈ ఘటనలో కరుణకు తీవ్ర గాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు వచ్చేలోపు దుండగులు పరారయ్యారు. యాసిడ్ దాడి సమయంలో కరుణ తనను రక్షించాలంటూ ఆర్తనాదాలు చేసింది. కరుణ కుటుంబ సభ్యుల పోషణ కోసం ఓ కంపెనీలో పని చేస్తోంది. ఆమె కొంతకాలం క్రితం ఓ వ్యక్తి వద్ద 5 రూపాయల వడ్డీ కింద రూ.20వేలు అప్పు చేసింది. గడువులోగా ఆమె అప్పు తీర్చలేదు. పైగా రెండు నెలలుగా ఆమె వడ్డీ కట్టలేదు. దీంతో అతను నిత్యం డబ్బులు అడుగుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె అప్పు తీర్చలేకపోయింది. ఈ క్రమంలో నిన్న రాత్రి ఆమె ఇంటికి వెళ్లి… బయటకు పిలిచాడు. అప్పు గురించి అడిగే క్రమంలో ఆ తర్వాత యాసిడ్ దాడి చేశాడు. అంతకుముందు పలుమార్లు ఆమెతో అసభ్యంగా మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. తనతో వస్తే అప్పు మాఫీ చేస్తానని చెప్పినట్లుగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version