ALERT : పోలీస్, ప్రెస్ స్టిక్కర్లతో తిరుగుతున్న వాహనాలపై చర్యలు

-

బ్లాక్ స్టిక్కర్ల పై కోరడ ఝళిపిస్తున్నారు హైదరాబాద్‌ నగర ట్రాఫిక్ పోలీసులు. ఎమ్మెల్యే, పోలీస్, ప్రెస్ స్టిక్కర్ల తో పాటు బ్లాక్ గ్లాస్ లతో తిరుగుతున్న వాహనాలపై చర్యలకు సిద్ధం చేశారు పోలీసులు. జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద బ్లాక్ ఫిల్మ్ లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు. బ్లాక్ ఫిల్మ్ లతో తిరుగుతున్న వాహనాలని ఆపి ఫిల్మ్ లను తొలగిస్తున్న పోలీసులు…. నిబంధనలు విరుద్ధంగా బ్లాక్ ఫిల్మ్ వాడకంపై మోటార్ వెహికల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు.

అటు వాహనాలను ఆపి బ్లాక్ ఫిల్మ్ తొలగిస్తూ ఉండటంతో వాగ్వాదానికి దిగుతున్నారు వాహన యజమానులు.  నిబంధనలకు లోబడి నడుచుకోవాలని పోలీసులు హితువు పలుకుతున్నారు. అయితే. బ్లాక్ స్టిక్కర్ల పై కోరడ ఝళిపించేందుకు రెండు వారాల పాటు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు హైదరాబాద్‌ నగర ట్రాఫిక్ పోలీసులు. జూబ్లీహిల్స్ కారు ఘటన నేపథ్యంలో బ్లాక్ స్టిక్కర్స్ తో తిరుగుతున్న వాహనాల తనిఖీ ముమ్మరం చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version