త్వరలో పెరగనున్న టమోట, బాదం, కాఫీ ధరలు.. కారణం ఇదేనా..!

-

ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా దాని ప్రభావం..స్టాక్ మార్కెట్ పైన పడుతుంది.. ఫలితంగా..కొన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి.. బంగారం, వెండి, పెట్రోల్, ఆయిల్ ఇందులో ముందుంటాయి. మరి వాతావరణంలో వచ్చే ప్రతికూల మార్పులకు కూడా కొన్ని ఎఫెక్ట్ అవుతాయి. అందులో కూరగాయలు, వంటింట్లో వాడే పదార్థాలు ఉంటాయి. ఇప్పుడు ఈ మార్పుల వల్లే.. టమోటాలు, బాదం, కాఫీ ధరలు పెరగనున్నాయి. వీటికి కారణాలేంటో..వివరంగా చూద్దాం..!

తగ్గిన టమోటా ఉత్పత్తి

ఐరోపాలో ఇటలీ అతిపెద్ద టమోటా ఉత్పత్తిదారుగా ఉండేది.. ప్రతి సంవత్సరం సగటున 6 నుంచి 7 మిలియన్ మెట్రిక్ టన్నులు సరఫరా చేస్తుంది. ఇప్పుడు మరింత తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు పండ్ల పెంపకానికి వెచ్చని స్వర్గధామంగా ఉన్న వాతావరణం నేడు చల్లగా మారి వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. తక్కువ ఉష్ణోగ్రతలు పండు పక్వానికి వచ్చే ప్రక్రియను నెమ్మదిస్తున్నాయి. 2019లో ఒప్పందం కుదుర్చుకున్న మొత్తంలో సగం కంటే తక్కువ ఉత్పత్తి చేశారు. ఇది ఇలాగే కొనసాగితే టమోట ధరలు పెరుగుతూనే ఉంటాయి.

సంక్షోభంలో బాదం సాగు

టమోటాలు కాకుండా బాదం, కాఫీ, హాజెల్ నట్స్, సోయాబీన్స్ వంటివి వాతావరణ మార్పుల వల్ల ఎక్కువగా ప్రభావితమవుతాయి. ప్రపంచంలోని బాదం ఎగుమతుల్లో 80శాతం కాలిఫోర్నియా ఉత్పత్తి చేస్తుంది. కాలిఫోర్నియా అంతటా కరువు కారణంగా రైతులు తోటలను వదిలేస్తున్నారు. ఎందుకంటే వాటిని నిలబెట్టుకోవడానికి తగినంత నీరు దొరకడం లేదు.. దీంతో త్వరలో బాదం పప్పుల ధర పెరగవచ్చు.

కాఫీ ధరలు

బ్రెజిల్‌లో కాఫీ ఉత్పత్తి రాబోయే కొన్నేళ్లలో 76 శాతం తగ్గుతుందని అంచనా. ఎందుకంటే దేశం పొడిగా మారుతోంది. కాఫీ మొక్కలు తేమ, ఉష్ణమండల వాతావరణం బాగా అవసరం. నేలలు, ఉష్ణోగ్రతలు దాదాపు 21°Cకి చేరుకుంటాయి. దీంతో కాఫీ ఉత్పత్తి మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి. దీంతో ధరలు భారీగా పెరుగున్ననట్లు నిపుణులు అంటున్నారు.

మన దేశంలో కూడా వీటి వాడకం ఎక్కువే.. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. టమాటలకు మదనపల్లే ఫేమస్. ఇక్కడ పరిస్థితులను బట్టి.. ధర ఉంటుంది. కానీ బాదం, కాఫీపొడి అయితే.. మనం దిగుమతి చేసుకోవాల్సిందే..!

Read more RELATED
Recommended to you

Exit mobile version