Shyam Singha Roy: అల‌జ‌డిలా ఎగ‌సిప‌డుతున్న”శ్యామ్ సింగ‌రాయ్”

-

Shyam Singha Roy : న్యాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా న‌టిస్తున్న చిత్రం శ్యామ్ సింగరాయ్. రాహుల్‌ సంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్.. నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. ప్రేక్ష‌కులు నుంచి కూడా భారీగా ఆద‌ర‌ణ వ‌స్తుంది.

దీంతో ఈ మూవీపై అంచ‌నాలు పెరిగాయి. కలకత్తా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని డిఫరెంట్ గెటప్‏లో కనిపించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్‌ 24న విడుదల కానుంది.

ఈ క్ర‌మంలో శ‌ర‌వేగంగా ప్రచార కార్యక్రమాల‌ను నిర్వ‌హిస్తుంది చిత్ర బృందం. ఇందులో భాగంగా ‘రైజ్‌ ఆఫ్‌ శ్యామ్‌’ పేరుతో నవంబర్‌ 6న తొలి పాట‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.
తాజాగా దీపావ‌ళి కానుక‌గా.. శ్యామ్ సింగరాయ్ నుంచి ఫస్ట్ లిరికల్ పాటను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ లిరిక‌ల్ టీజ‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి భారీ రెస్పాన్స్ వ‌స్తుంది. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచింది.

ఎగ‌సి ప‌డే అల‌జ‌డి వాడే.. అంటూ సాగే పాట‌ను వింటుంటే.. ఒళ్లు గ‌గ్గుర్లు పొడుస్తుంది. చాలా ఇన్ ప్రెష‌న‌ల్ గా ఉంది. ఈ పాట సినిమాపై మరింత‌ అంచనాలను పెంచేసింది. ఈ పాటను కృష్మకాంత్ రాయగా.. మిక్కి జే మేయర్ సంగీతం అందించారు. ఈ సినిమాను నిహారిక ఎంటర్ టైన్మెంట్స్ పై వెంకట్ బోయినపల్లి నిర్మించారు. కోల్‌కతా నేపథ్యంలో సాగే విభిన్నమైన థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన పీరియాడిక్‌ చిత్రమిది. నాని రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version