మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక నిశ్చితార్ధం తాజాగా కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. గుంటూరు జిల్లా పోలీస్ అధికారి కుమారుడు చైతన్యతో నిహారిక ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ నిశ్చితార్ధం కార్యక్రమంలో చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అరవింద్, అల్లు అర్జున్తో సహా మొత్తం మెగా ఫ్యామిలీ పాల్గొంది. కరోనా నేపథ్యంలో ఈ నిశ్చితార్ధ వేడుక ఎంతో సింపుల్గా జరిగింది. చైతన్య కుటుంబంతో మెగా ఫ్యామిలీకి ఎప్పటి నుంచో పరిచయం ఉందట.
చిరంజీవి తండ్రి కొణిదెల వెంకటరావు, చైతన్య తాతయ్య గుణ వెంకటరత్నం ప్రాణ స్నేహితులు కావడంతో ఈ సంబంధం సెట్ అయినట్టు తెలుస్తోంది. చైతన్య స్వస్థలం గుంటూరు కాగా.. ఇండియన్ స్కూల్ బిజినెస్లో ఎంబీఏ పూర్తిచేశారు. చైతన్య.. హైదరాబాద్లోని ఓ ఎంఎన్సీ కంపెనీలో ఉన్నత పదవిలో ఉన్నట్టు సమాచారం.