ఇటీవల ఆయన ఆరోగ్య పరీస్థితి క్షీణించిందని, వెంటిలేటర్‌పై చికిత్సని అందిస్తున్నారని ఆయన కుమార్తె శివాత్మక ట్వీట్ చేయడం కలకం రేపింది. దీంతో ఆయన ఆరోగ్యం బాగానే వుందని, చికిత్సకు స్పందిస్తున్నారని పుకార్ల ని నమ్మవద్దంటూ రాజశేఖర్ కుటుంబం వివరణ ఇచ్చింది.
తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రి వర్గాలు తాజాగా స్పందించారు. రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై తాజాగా హెల్త్ బులిటెన్‌ని విడుదల చేసింది. రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగవుతోందని శనివారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో వెల్లడించారు.
`కరోనాతో బాధపడుతూ సిటీ న్యూరో సెంటర్ ఫర్ సర్వీసెస్‌లో చేరిన డా. రాజశేఖర్ క్రమంగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగవుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా వుంది. డాక్టర్ల ట్రీట్‌మెంట్‌కు ఆయన స్పందిస్తున్నారు. ఐసీయూలో వున్న రాజశేఖర్‌కు నిరంతరం ఆక్సిజన్ అందిస్తున్నాం. ఎప్పటికప్పుడు వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు` అని సిటీ న్యూరో సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రత్న కిషోర్ వెల్లడించారు.