నటి కీర్తి సురేశ్‌కు కొత్త కష్టం.. ‘బేబీ జాన్’మూవీ ప్రమోషన్లలో ఏం జరిగిందంటే?

-

ఇటీవల తన చిన్ననాటి స్నేహితుడు అంటోని తట్టిల్‌ను లవ్ మ్యారేజ్ చేసుకున్న మహానటి ఫేమ్ కీర్తి సురేశ్ తాజాగా ముంబైలో మూవీ ప్రమోషన్లలో పాల్గొన్నది. పెళ్లై వారం రోజులు కూడా గడువక ముందే కీర్తి సురేశ్ తన బాలీవుడ్ ప్రాజెక్టు అయిన బేబీ జాన్ మూవీ ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటున్నది. అయితే, ప్రమోషన్లలో భాగంగా ఆమెకు వింత అనుభవం ఎదురైంది.

అక్కడి సినిమా రిపోర్టర్లు ఆమె ఎక్కడికెళ్తే అక్కడ వెంటపడుతున్నారు. శుక్రవారం కెమెరామెన్లు ఆమెను ఫొటోలు తీస్తూ ‘కృతి ఇటు చూడండి’ అంటూ అని అరిచారు. దీంతో ఆమె కృతి కాదు కీర్తి’అని చెప్పారు. తర్వాత మరొకరు ‘కీర్తి దోశ’అంటూ పిలవడంతో ‘కీర్తి దోశ కాదు.. కీర్తి సురేశ్. దోశ నాకు ఇష్టమైంది’ అని నవ్వుతూ చెపారు.ముంబైలో కీర్తీసురేశ్‌కు పేరు కష్టాలు వచ్చాయని నెటిజన్లు ఫన్నీగా ట్వీట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version