కూతురు చేసిన క్యూట్ పనికి తెగ సంబురపడిపోయిన అలియాభట్..

-

బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలియాభట్ జంటకు ‘రాహ’ ముద్దుల కూతురు ఉన్న విషయం తెలిసిందే. ఈ పాపను మొన్నటివరకు మీడియాకు దూరంగా ఉంచిన ఈ జంట.. ప్రస్తుతం ఓపెన్ గానే తమ కూతురిని అలియా, రణబీర్ కపూర్ బయటకు తీసుకెళ్తున్నారు. తాజాగా ఎయిర్ పోర్టులో ఈ స్టార్ కపుల్ తమ కూతురుతో ఎక్కడికో వెళ్తుండగా ఫ్యాన్స్ గట్టిగా అరుస్తూ వారిని పిలిచే ప్రయత్నం చేశారు.

ఆ సమయంలో తమ కూతురు చేసిన పనికి అలియాభట్ ఎంతో మురిసిపోయింది. రాహను బయటకు తీసుకురావడంతో జనాలు కేకలు వేస్తుండగా.. తన తల్లి చేతిలో ఉన్న రాహ ఒక్కసారిగా వెనక్కి తిరిగి అందరికీ హాయ్ చెబుతూ, ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది. ఆ సీన్ చూసి అలియా తెగ సంతోషపడిపోయింది.ఈ వైరల్ వీడియో చూసి ‘రాహ చాలా క్యూట్’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version