God Father: గాడ్‌ ఫాదర్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్! మ‌రోసారి చిరుతో న‌టించ‌నున్న ఆల‌నాటి అందాల తార‌!

-

God Father: పాలిటిక్స్ త‌రువాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ జోష్‌ మీదున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఆచార్య సినిమా షూటింగ్ దాదాపు చివరికి వచ్చేసింది. ఈ సినిమాలో చిరుతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్లు, టీజర్ సినిమా అంచనాలను పెంచాయి.

ఇదిలా ఉంటే.. త‌గ్గేదేలేదు.. అన్న‌ట్టుగా చిరంజీవి తన 153వ సినిమాని దర్శకుడు మోహన్ రాజాతో చేస్తున్నారు. మలయాళ బ్లాక్ బస్టర్ హిట్ అయిన‌ ‘లూసిఫర్‌’ కు ఇది రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, సూపర్‌గుడ్ ఫిలీమ్ బ్యాన‌ర్ పై ఆర్‌.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. తాజాగా చిత్రానికి ‘గాడ్‌ ఫాదర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రం నుంచి విడుదల‌యిన టైటిల్‌, ప్రీలుక్‌ అభిమానులను విశేషంగా అలరిస్తోంది.

పొలిటికల్‌ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రంలో పలువురు న‌టులు మెరవనున్నారు. ఇప్పటికే సత్యదేవ్‌.. కీల‌క పాత్రలో న‌టించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. త్వరలోనే మిగిలిన నటీనటుల వివరాలను కూడా చిత్ర బృందం వెల్లడించనుంది. కాగా.. ఈ సినిమాలో ఆల‌నాటి అందాల తార కుష్భూ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారని టాక్ వ‌స్తుంది. కుష్భూ ..గతంలోనూ చిరుతో క‌లిసి ‘స్టాలిన్’ సినిమాలో న‌టించింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరు కలిసి న‌టించ‌నున్నార‌ని తెలియ‌డంతో మెగా అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహం నెలకొంది.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సౌత్ ని ఏలిన కుష్బూ సుందర్.. సెకండ్ ఇన్నింగ్స్ లో కీల‌క పాత్ర‌ల్లో స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టిస్తున్నారు. ఆమె అజ్ఞాతవాసి మూవీలో పవన్ తల్లి పాత్రలో న‌టించింది. ప్రస్తుతం కుష్బూ సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నాత్తే చిత్రంలో నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version