బాలనటి గా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది సీనియర్ నటి సుధ. తల్లిగా, వదినగా ఇలా చాలా పాత్రలు చేస్తూ… తన కెరీర్ లో మంచి పేరు తెచ్చుకుంది ఈ నటి. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గానూ అందరినీ అలరించింది. ఇది ఇలా ఉండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధ.. తన కుటుంబ సభ్యులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తెకు పెళ్లి చేసిన తర్వాత చెన్నైలో ఉంటున్నానని ఆమె పేర్కొంది.
తన భర్త, కుమారుడు తన నుంచి వేరుగా అమెరికాలో ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. వాళ్లు లేకున్నా అనేక కష్టాలు పడుతూ జీవితాన్ని లాక్కోచ్చానని తెలిపింది. తన పరిస్థితి వారికి తప్పదని కాస్త మండిపడ్డారు. ఒకప్పుడు తన తల్లిదండ్రులకు బాగా ఆస్తులు ఉండేవని.. తన బాల్యంలోనే పేరేంట్స్ ను కోల్పోయాని ఆవేదన వ్యక్తం చేసింది నటి సుధ. తల్లి పోయినప్పటి కంటే తండ్రి మరణం తనను చాలా బాధించిందని.. జీవితం అంటే ఏంటో అర్థమైందని పేర్కొంది. మా నాన్నకు కొడుకులున్నా.. ఆయనను తానే చూసుకున్నానని వెల్లడించారు.