ర‌వితేజ‌ను ఆ హీరోయిన్ నిలువునా ముంచేసిందా…!

-

మాస్ మ‌హారాజ్ ర‌వితేజ హీరోగా వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డిస్కోరాజా’. రాజా ది గ్రేట్ సినిమాతో హిట్ కొట్టిన ర‌వితేజకు ఆ త‌ర్వాత వ‌చ్చిన మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాల‌ని డిసైడ్ అయిన ర‌వితేజ డిస్కోరాజా చిత్రంపై భారీ ఆశ‌లు పెట్టుకున్నాడు. ఇక‌ రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నభా నటేష్‌, పాయల్‌ రాజ్‌పుత్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది.

ఈ సినిమాలో పాయ‌ల్ క‌ళ్లు లేని అమ్మాయిగా ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. కానీ ఇక్క‌డ ర‌వితేజాకు ఓ చిక్కొచ్చి ప‌డింది. వాస్త‌వానికి RX 100 సినిమాలో పాయ‌ల్ బోల్డ్ ప‌ర్ఫామెన్స్ ఇచ్చినా కొంత క్రేజ్ సంపాదించుకుంది. దీంతో ర‌వితేజా పాయ‌ల్ త‌న సినిమాకు ప్ల‌స్ అవుతుంది భావించి పాయ‌ల్‌ను ఫిక్స్ చేశారు. కాని ఇటీవ‌ల విడుద‌ల అయిన `RDX ల‌వ్‌` ట్రీజ‌ర్‌తో ఆమెపై బీ గ్రేడ్ హీరోయిన్‌గా ముద్ర వేసేశారు. ఈ చిత్రంలో ఆమె బోల్డ్ క్యారెక్ట‌ర్ పీక్స్‌లో ఉండ‌డంతో ఈ ఎఫెక్ట్ డిస్కోరాజా సినిమాపై ప‌డే అవ‌కాశం ఉంది.

అయితే పాయ‌ల్ `RDX ల‌వ్‌` చిత్రానికి సైన్ చేసిన‌ప్పుడే.. త‌న సినిమాకు తీసుకోవాల‌న్న నిర్ణ‌యాన్ని మార్చుకున్న నాగ‌శౌర్య సేఫ్ అయ్యాడు. ఇప్ప‌టికే ర‌వితేజ్ మార్కెట్ డౌన్‌లో ఉండ‌డ‌మే కాకుండా ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ను కూడా దూరం చేసుకుంటి. ఇక బోల్డ్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకున్న పాయ‌ల్ ఎఫెక్ట్ డిస్కోరాజాపై ప‌డ‌నుంది. ఇలా ర‌వితేజాను నిలువునా ముంచేసిన‌ట్టే అవుతుంది. ఇక ఈ సినిమా వినాయ‌క చ‌వితి రోజున‌ ఫ‌స్ట్ లుక్‌ విడుద‌ల చేయ‌నుంది. డిసెంబరు 20న క్రిస్మస్ కానుక విడుద‌ల చేయ‌బోయే ఈ సినిమాపై పాయ‌ల్ ఎఫెక్ట్ ఎంత వ‌ర‌కు ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version