రోజురోజుకి ఆడవారిపై అఘాయిత్యాలు, వేధింపులు, బెదిరింపుల పెరిగిపోతున్నాయి. సామాన్య స్త్రీ నుంచి సెలబ్రిటీ వరకు అందరికి ఈ సమస్యలు ఎదురవుతున్నాయి. తాజాగా.. తమిళ నటి విజయలక్ష్మికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వేధింపులు తట్టుకోలేక ఈమె ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే జులై 26న ఈమె ఫేస్ బుక్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ తర్వాత కొన్ని మాత్రలు మింగేసింది. కాగా, ప్రస్తుతం ఈమెకు చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స జరుగుతుంది.
తన ఫాలోయర్స్ సీమాన్, హరి నడర్ కారణంగానే తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నట్లు వీడియోలో చెప్పింది విజయలక్ష్మి. ఇది తన చివరి వీడియో అంటూ మాట్లాడింది విజయలక్ష్మి. ప్రధానంగా సీమన్, హరి నాడార్ ఫాలోవర్లు తనను వేధిస్తున్నారని, వారిద్దరినీ అరెస్ట్ చేయాలని విజయలక్ష్మి వీడియోలో డిమాండ్ చేశారు. సీమన్, అతడి పార్టీ కార్యకర్తల వల్ల గత నాలుగు నెలలుగా నేను తీవ్ర ఒత్తిడిలో ఉన్నా. నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నించా. మీడియాలో నన్ను హరి నాడార్ అవమానించారు. నేను బీపీ మాత్రలు తీసుకున్నా. మరి కాసేపట్లో నా బీపీ పడిపోతుంది. ఆ తర్వాత చనిపోతా’ అని పేర్కొన్నారు.