ED notices issued by YCP Rajya Sabha MP Vijayasai Reddy: వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి ఊహించని షాక్ తగిలింది. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ నోటీసులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్‌లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్న కేసులో నిందితులపై ఈడీ ఉచ్చు బిగిస్తోంది.
వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తనయుడు వై. విక్రాంత్‌రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి, ఆయన అల్లుడి సోదరుడు పెనక శరత్ చంద్రారెడ్డి, పీకేఎఫ్ శ్రీధర్, ఎల్‌ఎల్‌పీ ప్రతినిధులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే… వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ నోటీసులు జారీ కావడంపై ఇంకా ఆయన స్పందించలేదు. దీనిపై ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. మరి ఈడీ నోటీసులను ఎంపీ విజయసాయి రెడ్డి ఎలా ఎదుర్కొంటారో చూడాలి.