గ్రీన్ ఎనర్జీ పవర్ కాంట్రాక్టుల కోసం భారత్‌లోని వివిధ రాష్ట్రాల్లోని కీలక నేతలు, అధికారులకు అదానీ గ్రూప్ రూ.2,200 కోట్ల ముడుపులు ఇచ్చారనే అభియోగాలు దేశంలో పొలిటికల్ హీట్‌ను మరింత పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ, ఆయన సోదరుడి కుమారుడు సాగర్ అదానీలకు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ నోటీసులు జారీ చేసింది.
దీనిపై లోక్‌సభ పక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా మరోసారి స్పందించారు.గౌతమ్ అదానీని మోడీ సర్కార్ వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఆయన్ను కాపాడుతున్నారని, చిన్న చిన్న ఆరోపణలపై వందల మందిని అరెస్ట్ చేస్తున్నారని.. అదానీ విషయంలో కేంద్రం వైఖరి ఏమిటో చెప్పాలన్నారు. అభియోగాలను అదానీ అంగీకరిస్తారని ప్రభుత్వం అనుకుంటుందా? అని ప్రశ్నించారు. లంచాల ఆరోపణలను అదానీ ముమ్మాటికీ ఒప్పుకోరని రాహుల్ గాంధీ మండిపడ్డారు.