కుక్కకు చికెన్‌ ముక్కలు వేసి రూ. 20లక్షలు దోచుకెళ్లిన దొంగలు..

-

ఈరోజుల్లో దొంగలు చాలా తెలివిమీరారు.. టెక్నాలజీని వాడుతున్నారు.. స్మార్ట్‌గా దొంగతనాలు చేస్తున్నారు. దొంగతానికి వెళ్లే చోట ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ముందే అంచానా వేసి వాటిని ఎదుర్కోవడానికి కావాల్సిన వాటిని తమతో తీసుకెళ్తున్నారు. ఏ కంపెనీ, ఇళ్లు అయినా కుక్కలు ఉండే అవకాశం ఉందని ఓ దొంగత చికెన్‌ ముక్కలు తీసుకెళ్లాడు.. గుంటూరు మిర్చి ఎగుమతుల కంపెనీలో భారీ చోరీ జరిగింది. దొంగలను కుక్క చూసి అరవడంతో..తమ వెంట తెచ్చుకున్న చికెన్‌ ముక్కలు వేసి పారిపోయారు..
మిర్చి ఎగుమతుల కంపెనీలో భారీ చోరీ జరిగింది. రూ. 20 లక్షలకుపైగా నగదు అపహరించుకెళ్లారు. చోరీ చేసిన అనంతరం తిరిగి వెళ్తుండగా అక్కడే ఉన్న కుక్క అరవడంతో తమ వెంట తెచ్చుకున్న చికెన్‌ ముక్కలు వేసి ద్విచక్రవాహనంపై పారిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటప్పయ్యకాలనీ లాల్‌పురంరోడ్డు చివర ఓ మిర్చి ఎగుమతుల కంపెనీ ఉంది. మలేషియా తదితర ప్రాంతాలకు భారీ మొత్తంలో ఇక్కడ నుంచే మిర్చిని ఎగుమతి చేస్తుంటారు.
శనివారం అర్థరాత్రి 2.30 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చారు. అలికిడి కావడంతో ఎవరని కంపెనీ వద్ద వాచ్‌మెన్‌ ఆవులయ్య అరవడంతో అతని చేతులను తాళ్లతో కట్టేశారు. అరిస్తే చంపేస్తామంటూ తమ వద్ద ఉన్న బ్లేడ్‌తో వాచ్‌మెన్‌ను బెదిరించారు. ఇద్దరు వ్యక్తుల్లో ఒకతను వాచ్‌మెన్‌ వద్ద ఉండగా మరో వ్యక్తి కంపెనీ ప్రధాన ద్వారానికి వేసిన తాళం కోసి లోపలకు వెళ్లాడు. కబోర్డుకు ఉన్న తాళం కోసి అందులో ఉన్న నగదును అపహరించారు. ఇక్కడి వరకూ బానే ఉంది.. వాచ్‌మెన్‌ అయితే చంపెస్తామని బెదిరించారు.. కానీ కుక్కకను బెదిరించలేరుగా.. బయటకు వెళుతున్నప్పుడు కంపెనీ వద్ద ఉన్న కుక్క అరవడం మొదలుపెట్టింది. నిందితులు తమ వెంట తెచ్చుకున్న చికెన్‌ ముక్కలు వేసి ద్విచక్రవాహనంపై పారిపోయారు.
దాదాపు రూ. 20 లక్షలకు పైగా నగదు అపహరించుకెళ్లినట్లు కంపెనీ యజమాని తెలిపాడు.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలిలో నేరవిభాగ పోలీసులు, క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించారు. ఆ కంపెనీలో పనిచేసే సిబ్బందిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version