అందాలతో కవ్విస్తున్న జాన్వీ కపూర్..!

-

అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలు ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందచందాలతో సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పటికప్పుడు ఫ్యాషన్ దుస్తులతో యువతకు ఫ్యాషన్ ఐకాన్ గా మారిపోయింది. ముఖ్యంగా ఈమె షేర్ చేసే ఫోటోలలోని దుస్తులను యువత కూడా ఫాలో అవుతున్నారని చెప్పడంలో సందేహం లేదు. తాజాగా జాన్వీ కపూర్ గ్రేజియా యంగ్ ఫ్యాషన్ అవార్డు 2022లో భాగంగా అదిరిపోయే దుస్తుల్లో మెరిసింది. తాజాగా ఈమె ధరించిన బాడీ హగ్గింగ్ ఎల్లో కలర్ గౌన్ లో ఈమెను చూసి యువత కళ్ళు తిప్పుకోలేకపోతున్నారు.

తాజాగా ఈమె ఈవెంట్ కోసం ఆడోర్ దుస్తులను ధరించింది. మోనోటోన్ వన్ షోల్డర్ డ్రెస్ ఫిగర్ ను ధరించి మెరిసింది ఈ ముద్దుగుమ్మ. ఒక సింగిల్ లాంగ్ స్లీవ్.. ఒక కటౌట్ కలిగి ఉంది. ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన విధానం, తన శరీరాన్ని విల్లులా వంచిన విధానం చూసి యువత మరింతగా మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ముఖ్యంగా తన అందాన్ని మేకప్ మరియు వెంట్రుకలతో మరింత అందంగా హైలెట్గా కనిపించేలా చేస్తోంది. ఏది ఏమైనా ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం చాలా వైరల్ గా మారుతున్నాయి.

జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ విషయానికి వస్తే.. త్వరలోనే కొరటాల శివ , ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో ఈమె అవకాశాన్ని దర్శించుకుందని సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదు కానీ ఇప్పటికే ఈ విషయం బాగా వైరలైపోయింది. దర్శకుడు కొరటాల శివ కూడా ఈమెకు కథ వినిపించారని ఈమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఒకవేళ ఈ సినిమాలో నటిస్తే జాన్వి కపూర్ తల్లి కోరిక నెరవేరినట్టే.

Read more RELATED
Recommended to you

Exit mobile version