కౌశిక్ రెడ్డి వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారు అని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. వీధి రౌడీలతో కేటీఆర్ రాజకీయం చేస్తున్నారు. అధికారులు ఎమ్మెల్యేలు అందరిపైనా దాడులు చేసేది BRS నేతలే అని ఆయన పేర్కొన్నారు. అసలు ఈ దాడుల సంస్కృతిని BRS ప్రోత్సహిస్తుంది. ఏది ఏమైనా కేటీఆర్ సహా అవినీతి చేసిన వాళ్లంతా ఉండాల్సింది జైల్లోనే అని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు.
అలాగే జైల్లో ఉండాల్సిన వాళ్లు బయట రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. లొట్ట పీసుకేసు ఆన్న కేటీఆర్ సుప్రీంకోర్టు దాకా ఎందుకు వచ్చారు. అన్ని దొంగతనాలు ప్రజలకు తెలుస్తాయి. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందే. ప్రశ్నిస్తే అరెస్టులా అంటున్న టిఆర్ఎస్ నేతలు 10 ఏళ్లలో చేసింది ఏమిటి.. కోదండ రామ్, మందకృష్ణ మాదిగ, విమలక్క సహా ప్రజాస్వామ్యక వాదులు, ప్రతి పక్ష నేతలు మీద BRS ఏం చేసిందో అందరికి తెలుసు. కాబట్టి ప్రజలే దాడులు చేసే పరిస్థితి BRS నేతలు తెచ్చుకోవద్దు అని అద్దంకి దయాకర్ సూచించారు.