మద్యానికి బానిసై.. జీవితంపై విరక్తి చెంది.. చివరకు!

-

మద్యానికి బానిసైన ఓ వ్యక్తి జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు రెవెన్యూ డివిజన్ మంగపేట మండలంలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. బంధువుల కథనం ప్రకారం.. పద్మశాలి వాడకు చెందిన సురేష్ (37) ఏటూరునాగారం రామాలయం వీధికి చెందిన రేణుక అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు.

వారిద్దరూ బేకరీలో పని చేసుకుంటూ కొంత కాలంగా అక్కడే జీవిస్తున్నారు. మద్యానికి బానిసైన సురేష్ పనులకు వెళ్లకుండా తరచూ భార్యతో గొడవపడుతూ ఉండేవాడు. నెలకిందట మంగపేటలోని తన అక్క నర్సమ్మ ఇంటికి వచ్చిన సురేశ్.. అనారోగ్యానికి గురయ్యాడు. అతని సోదరి సురేశ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించి భార్యకు సమాచారం ఇచ్చారు. ఆమె రాలేనని చెప్పినట్లు తెలిసింది.ఈ క్రమంలోనే గౌరారం వాగు బ్రిడ్జికి సురేష్ ఉరేసుకుని కనిపించినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news