వైసీపీ పార్టీకి మరో షాక్ తగిలింది. వైసీపీ కార్యాలయానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. సీసీ ఫుటేజ్ ఇవ్వాలంటూ వైసీపీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. జగన్ ఇంటి వద్ద మంటల ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంటలు ఎలా అంటుకున్నాయో తేల్చేందుకు దర్యాప్తు చేపడుతున్నారు తాడేపల్లి పోలీసులు. ఈ తరునంలోనే.. నోటీసులు ఇష్యూ చేశారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/jagan-hom.jpg)
అయితే.. వైసీపీ కార్యాలయానికి పోలీసులు నోటీసులు ఇవ్వడంపై జగన్ టీం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇక అటు జగన్ ఇంటి వద్ద అగ్ని ప్రమాదంపై టీడీపీ పార్టీ స్పందించింది. “సిట్ పడింది.. తగలబడింది”… జగన్ ఇంటి వద్ద అగ్ని ప్రమాదంపై అంటూ టీడీపీ సంచలన ట్వీట్ చేసింది. ఉదయం లిక్కర్ స్కాంలో సిట్ పడింది.. రాత్రికి తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడిందంటూ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేసింది టీడీపీ. దీంతో… జగన్ ఇంటి వద్ద అగ్ని ప్రమాదంపై టీడీపీ పార్టీ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.