”అఖండ”మ్యూజిక్ జాతర షురూ..ఫస్ట్ సాంగ్ రిలీజ్

-

హీరో బాలకృష్ణ అభిమానులు అత్యంత ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి అఖండ. ఈ భారీ యాక్షన్‌ డ్రామాకు మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. సింహ, లెజెండ్‌ లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ తర్వాత బాలకృష్ణ… దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌ లో రూపొందుతున్న హ్యట్రిక్‌ మూవీ అఖండ. ఇక సినిమా లో కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్‌ నటిస్తోంది.

ఇక తాజా సమాచారం మేరకు ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది. ఈ నేపథ్యం లోనే తాజాగా సినిమా నుంచి అదిరి పోయే అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా నుంచి మొదటి పాట అయిన ”అడిగా…అడిగా” అనే లిరికల్‌ వీడియో ను చిత్ర బృందం విడుదల చేసింది.  ఇక ఈ ఫస్ట్‌ సాంగ్‌ లో.. బాలకృష్ణ మరియు ప్రగ్యా జైస్వాల్‌ మధ్య రొమాంటిక్ సీన్స్‌ అందరినీ కనివిందు చేస్తున్నాయి. అటు బాలయ్య.. స్టైలీస్‌ లుక్‌ లో కనిపించారు.  ఈ వీడియో సాంగ్‌ తో సినిమా పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version