రైతులను మోసం చేసింది చంద్రబాబు కాదా : మంత్రి ఆదిమూలపు

-

చంద్రబాబు నాయుడు హయాంలో ప్రకాశం జిల్లాలోని ప్రాజెక్టులను ఏనాడూ పట్టించుకోలేదని మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెలిగొండ ప్రాజెక్టును పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధం ప్రకటించానంటూ చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదమని కొట్టిపారేశారు. రైతులను మోసం చేసింది చంద్రబాబు కాదా? టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వెలిగొండను పట్టించుకోకుండా, ఇప్పుడు మాట్లాడతారా? ప్రకాశం జిల్లాకు చంద్రబాబు, లోకేశ్ ఏంచేశారంట? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Adimulapu Suresh clarifies on schools reopening, says no need to worry  about students health

చంద్రబాబు ప్రజలు గుర్తుకు వచ్చేది కేవలం ఎన్నికలప్పుడేనని మంత్రి ఆదిమూలపు విమర్శించారు. చంద్రబాబు వ్యవస్థలపై యుద్ధం ప్రకటించారని, అలజడులు సృష్టించి ప్రయోజనం పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ఏపీలో ప్రాజెక్టులు ప్రారంభించింది, పూర్తి చేసింది వైఎస్సార్ అని కొనియాడారు. రాష్ట్ర ప్రజలు సీఎం జగన్ వైపే ఉన్నారని స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేశ్, దత్తపుత్రుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా నిష్ప్రయోజనమేనని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version