జబర్దస్త్ షో గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అదిరే అభి..!!

-

జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ లలో అదిరే అభి కూడా ఒకరు. గత 16 యేళ్లు గా సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగుతున్న అభి.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా అంతగా క్రేజ్ రాబట్టలేకపోయాడు. ఎప్పుడైతే బుల్లితెర రంగంలోకి అడుగు పెట్టాడో అప్పటి నుంచి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. జబర్దస్త్ ద్వారా సక్సెస్ అయిన అదిరే అభి మరి కొంతమందికి కూడా అవకాశాలను కల్పించారు. అభి ద్వారా సక్సెస్ అయిన వారిలో ముఖ్యంగా హైపర్ ఆది ఒకరని చెప్పవచ్చు.అయితే వీరిద్దరూ విడిపోవడానికి గల కారణం కూడా ఇటీవల క్లారిటీ ఇవ్వడం జరిగింది వాటి గురించి చూద్దాం.

మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అభి కొన్ని రోజుల పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా చేశారు. అయితే అది అంతగా నచ్చలేదట. మళ్లీ తనకు ఇష్టమైన సినీరంగం వైపు తన అడుగులు వేస్తూ తన సత్తా చాటాలని అనుకున్నాడు.. ఇలాంటి సమయంలోనే అనుకోకుండా టెలివిజన్ వైపు నుండి కొన్ని ఆఫర్లు వచ్చాయి. కొన్ని డాన్సులతో కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. అదుర్స్ షో చేస్తున్న అదిరే అభి కి జబర్దస్త్ లో అవకాశం లభించింది.

ఇక ఆ తర్వాత ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో అవకాశం రావడంతో నటించారు. అంతేకాకుండా బాహుబలి సినిమాలో కూడా సహాయ దర్శకుడిగా కూడా వర్క్ చేశారట. మొదటి భాగం షూటింగ్ సమయంలో అతను ప్రభాస్ తో కూడా చాలా క్లోజ్ గా తిరిగే వారట. ఇక బాహుబలి సినిమాలో కూడా సుబ్బరాజు తో కలిసి ఒక చిన్న సన్నివేశంలో కూడా నటించారు. అదిరే అభి జబర్దస్త్ షో ద్వారా మంచి సక్సెస్ ను అందుకున్నారు. అనంతరం కొత్త వారికి అవకాశాలు ఎక్కువగా వచ్చేలా చేశారు. తన స్కిట్ లో కూడా ఎంతో మందికి అవకాశాలు కల్పించిన విషయం అందరికీ తెలిసిందే. ముందుగా హైపర్ ఆది తన గ్రూపులో ఒక సలహా దారుడు గా ఉండే వారని.. ఆ తర్వాత స్క్రిప్ట్ రైటర్ గా పెట్టుకున్నానని తెలిపారు. ఇక ఆ తరువాత ఖాళీగా ఉండటం ఎందుకని తన టీంలో కమెడియన్ గా చేసుకున్నారని తెలిపారు. అయితే జబర్దస్త్ దర్శకులు మరొక గ్రూప్ కావాలని అడగడంతో ఆది ని సంప్రదించారట. ఆ తర్వాత అతనికి సపోర్ట్ చేశాం అని తెలిపారు. కానీ హైపర్ ఆది కి తనకు విభేదాలు ఏమీ లేవని తెలిపారు అదిరే అభి.

Read more RELATED
Recommended to you

Exit mobile version