కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఇటీవల ఒమిక్రాన వేరియంట్‌కు చెందిన బీఏ 4 కేసు హైదరాబాద్‌లో నమోదు కాగా.. తాజాగా ఇప్పుడు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ5 కేసు నమోదైంది. తాజాగా ఓ వ్యక్తికి బీఏ 5 వేరియంట్ పాజిటివ్ గా ఉన్నట్టు గుర్తించారు. హైదరాబాద్ లో న్యాయ సలహాదారుగా సేవలు అందించే వ్యక్తిలో ఇది బయటపడింది. స్వల్ప లక్షణాలే ఉండడంతో ఇంట్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు.
సదరు వ్యక్తితో సన్నిహితంగా మెలిగిలిన ఇద్దరి నమూనాలను పరీక్ష కోసం పంపారు. అధికారులు గత 10 రోజులుగా ఆర్టీ పీసీఆర్ పరీక్షల కోసం వచ్చే నమూనాలకు జీనోమ్ టెస్టింగ్ కూడా చేస్తున్నారు. బీఏ 4 వేరియంట్ వ్యాపించడం లేదని అధికారులు ప్రకటించారు. దేశంలో బీఏ 5 మొదటి కేసు గుజరాత్ లో వెలుగు చూసినట్లు అంతర్జాతీయ డేటా స్పష్టం చేస్తోంది. ఈ వైరస్ వ్యాప్తిపై ఆందళన అవసరం లేదని వైద్య అధికారులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఇప్పటికిప్పుడు కేసులు భారీగా పెరిగే అవకాశమే లేదన్నారు.