టాలీవుడ్ హీరో సిద్ధార్థ హీరోయిన్ అదితి రావ్ హైదరి ప్రేమలో మునిగితేలుతున్నారని ప్రచారం గట్టిగా వినిపిస్తుంది. ఈ విషయంపై ఇప్పటివరకు వీరిద్దరూ స్పందించలేదు కానీ పలు కార్యక్రమాల్లో సైతం కలిసి హాజరయ్యారు. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించారు అదితి.
హీరోయిన్ అదితి రావు హైదరి సిద్ధార్థ ప్రేమలో ఉన్నట్టు గత కొన్నాళ్లుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వీరిద్దరూ ఇప్పటికే పలు కార్యక్రమాల్లో కలిసి హాజరయ్యారు. అలాగే బయట కూడా ఎన్నోసార్లు మీడియా కంట పడుతూ వస్తున్నారు. తాజాగా ఇన్స్టా రీల్స్ సైతం వీరిద్దరూ కలిసి చేయటంతో ఈ వార్తలు మరింత ఉపందుకున్నాయి. వీటన్నిటితో వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే అన్ని భాషల్లో హీరోయిన్గా మంచి పేరు సంపాదించుకున్న అదితి.. ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామం ఇచ్చినట్టే తెలుస్తుంది. అలాగే సినిమాలకు విరామం ఇచ్చి పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది.
అయితే తాజాగా అదితి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సిద్ధార్థ్ తో తనకున్న బంధం గురించి చెప్పుకొచ్చింది.. మా మధ్య ప్రేమ లేదు అని చెప్పకుండా ఇన్ డైరెక్ట్ గా మంచి అనుబంధం ఉందని తెలిపారు. మా ఇద్దరి మధ్య ఉన్న బంధం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు.. కొన్ని విషయాలు ఇతరులకు అనవసరం.. ఆ విషయాలను కేవలం పవిత్రంగా భావించి వదిలేయాలి అంటూ చెప్పుకొచ్చారు. కాగా ప్రేమ వార్తలను అదితి కొట్టి పారేయలేదు కాబట్టి వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారని మరొకసారి కన్ఫామ్ చేసుకున్నారు నెటిజెన్లు.
కాగా ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగిన సిద్ధార్థ తర్వాత నెమ్మదిగా సినిమాలకు దూరమయ్యారు. గతంలో కొందరు హీరోయిన్లతో ప్రేమాయణం నడిపినట్లు కూడా వార్తలు వినిపిస్తూ వచ్చాయి. చివరకు ఏ కథా సుఖాంతం కాకపోవడంతో కొన్నాళ్లు అన్నిటికీ దూరంగా ఉన్నా ఈ హీరో ప్రస్తుతం అదితి తో మాత్రం రిలేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.