6 ఏళ్లు ఉంటేనే 1వ తరగతిలో అడ్మిషన్‌ : కేంద్రం ప్రకటన

-

దేశంలోని విద్యార్థులకు బిగ్‌ అలర్ట్. ఆరేళ్లు ఉంటేనే 1వ తరగతిలో అడ్మిషన్‌ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. విద్యార్థుల అడ్మిషన్లపై కేంద్రం కొత్త రూల్ పెట్టింది. విద్యార్థుల అడ్మిషన్లకు సంబంధించి కేంద్రం కొత్తరూల్ తీసు కొచ్చింది.

విద్యార్థుల వయస్సు 6 ఏళ్లు ఉంటేనే ఒకటో తరగతిలో చేర్చుకోవాలని స్పష్టం చేసింది. ఈ రూల్ అమలు చేయాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే కేంద్రీయ విద్యాలయాల్లో 6 ఏళ్లు ఉన్న విద్యార్థులకే ఒకటో తరగతిలో అడ్మిషన్లు ఇస్తోంది. ఇక కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల.. భిన్నభిప్రాయాలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version