ఆప్గన్ లో మారణహోమం.. మసీదులో ఆత్మహుతి దాడి

-

తాలిబన్ల చేతికి వెళ్లిన తర్వాత ఆప్గనిస్తాన్ నెత్తురోడుతోంది. వరస దాడులతో అల్లాడుతోంది. అమాయకపు ప్రజలు వరసగా జరుగుతున్న దాడులతో మరణిస్తున్నారు. తాజాగా ఆప్గన్ లోని కుందుజ్ ప్రాంతంలో సయ్యద్ అబాద్ మసీదుపై ఆత్మాహుతి దాడి జరిగింది.  దాడి సమయంలో మసీదులో వందలాది మంది ముస్లీంలు మసీదులో ఉన్నారు. శుక్రవారం ప్రార్థనలో భాగంగా ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. ప్రార్థనల అనంతరం భారీ దాడి జరగడంతో దాదాపు 100 మంది దాకా మరణించారు. మరో 200 మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ఘటననపై తాలిబన్ ప్రభుత్వం అధికార ప్రకటన విడుదల చేసింది. ఐఎస్ఐఎస్ చేసిన దాడిగానే తాలిబన్లు అనుమానిస్తున్నారు. ఆప్గన్ లో ప్రముఖమైన మసీదు కావడం, శుక్రవారం పెద్ద సంఖ్యలో జనాలు రావడంతో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డట్లు తెలుస్తొంది. ఆప్గన్ తాలిబన్ల వశం అయిన తర్వాత నుంచి ఐఎస్ఐఎస్ ఉగ్ర సంస్థ వరసగా ఆప్గన్ లో దాడులకు తెగబడుతోంది. గతంలో కాబూల్ ఎయిర్ పోర్ట్ పై జరిగిన దాడిలో పలువురు ప్రజలతో పాటు అమెరికన్ సైనికులు కూడా మరణించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version