72 ఏళ్ల తర్వాత పాక్ లో తెరుచుకోనున్న హిందూ దేవాలయం

-

ఆ గుడిని సుమారు వెయ్యి ఏళ్ల కింద సర్దార్ తేజా సింగ్ నిర్మించారు. అందుకే దానికి షావాలా తేజా సింగ్ ఆలయం అని పేరు. భారతదేశ విభజనకు ముందు భారత్ లోనే ఆ గుడి అంతర్భాగం.

వేయ్యేండ్ల చరిత్ర ఆ దేవాలయం సొంతం. కానీ.. 72 ఏళ్ల క్రితం మూతపడింది. అప్పటి నుంచి ఆ గుడిలో పూజలు లేవు.. పునస్కారాలు లేవు. కానీ.. త్వరలో ఆ గుడి భక్తులకు అందుబాటులోకి రానుంది. పాకిస్తాన్ లోని హిందువులు ఆ గుడిలో ఇక పూజలు చేయొచ్చు. దేవుడిని మొక్కొచ్చు. ఆ గుడిని తెరవాలని పాకిస్తాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ గుడి పాకిస్తాన్ లోని సియాల్ కోట్ లో ఉంది.

ఆ గుడిని సుమారు వెయ్యి ఏళ్ల కింద సర్దార్ తేజా సింగ్ నిర్మించారు. అందుకే దానికి షావాలా తేజా సింగ్ ఆలయం అని పేరు. భారతదేశ విభజనకు ముందు భారత్ లోనే ఆ గుడి అంతర్భాగం. భారత్ నుంచి పాక్ విడిపోయాక.. ఆ గుడిలో పాక్ లో అంతర్భాగం అయింది. ఆ తర్వాత ఆ గుడిని మూసేశారు.

బాబ్రీ మసీదును హిందువులు కూల్చేసిన తర్వాత… దానికి నిరసనగా పాక్ లోని ఈ గుడిని పాకిస్థానీయులు కొందరు ధ్వంసం చేశారు. అప్పటి నుంచి ఇక ఆ గుడి వైపు కూడా ఎవ్వరూ వెళ్లలేదు. ఆ గుడిని సందర్శించడం ఆపేశారు హిందువులు.

తాజాగా… ఆగుడిని తెరవాలంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే ఆలయం పునరుద్దరణ పనులు కూడా నిర్వహించనున్నారు. ఇప్పటికే భక్తులు ఆ గుడిని సందర్శిస్తూ పూజలు నిర్వహిస్తున్నప్పటికీ… ఆలయ పునరుద్దరణ పనులు అయ్యాక అధికారికంగా ఆలయాన్ని ప్రభుత్వం తెరవనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version