కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నాక రోగనిరోధక శక్తి బాగా పెరగాలంటే ఇలా చేయండి.

-

ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనాకి వ్యాక్సిన్ వచ్చేసింది. తొమ్మిది నెలలపాటు మానవజాతిని స్తంభింపజేసిన సూక్ష్మజీవికి అంతం వచ్చేసింది. భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైపోయింది. ప్రపంచ దేశాల్లోనూ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోఖి వచ్చేసింది. ఐతే కరోనా వ్యాక్సిన్ పై చాలా మందికి అనేక అనుమానాలున్నాయి. మీడియాలో దాని గురించి ఏవేవో వార్తలు రావడం కూడా అందుకు కారణం. అదలా ఉంచితే, కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నవారికి రోగనిరోధక శక్తి సరిగ్గా పెరగాలంటే కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది.

వ్యాక్సినేషన్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతున్నప్పటికీ, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే దాని తీవ్రత మరింత ఎక్కువగా ఉండి, కరోనాని ఖతం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలంటే ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.

ఆల్కహాల్, స్మోకింగ్ వంటి వాటి జోలికి పోరాదు. మద్యం వల్ల శరీరంపై నెగెటివ్ ప్రభావం పడుతుంది. అందుకని పొగతాగడం, మద్యం సేవించడం చేయకపోతే వ్యాక్సిన్ ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది.

సరైన నిద్ర చాలా అవసరం. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత దాని సామర్థ్యాన్ని బాగా పెంచడానికి నిద్ర బాగా పనిచేస్తుంది. కనీసం 8గంటలైనా నిద్రపోతే బాగుంటుంది. నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయని తెలిసిందే.

వ్యాయామం:

వ్యాయామం మన శరీరాన్ని తేలికగా ఉంచి, ఆరోగ్యంగా చేస్తుంది. అందుకే వ్యాయామం చేయడం మర్చిపోవద్దు.

సరైన తిండి:

రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు ఆరోగ్యకరమైన ఆహారాలని తీసుకోవాలని డాక్టర్లు పదే పదే చెప్పారు. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఆహారం విషయంలో కాంప్రమైజ్ కావద్దు. మంచి ఆహారమే మంచి ఆరోగ్యం.

Read more RELATED
Recommended to you

Exit mobile version