పగటిపూట‌ నిద్రతో మతిమరుపు … నిజ‌మెంత‌….!

-

స‌హ‌జంగా నిద్ర అనేది ఒక వరం. చాలా మందికి ప‌గ‌టిపూట ప‌డుకునే అల‌వాటు ఉంటుంది. అయితే ప‌గ‌టి పూట ప‌డుకోవ‌డం వ‌ల్ల భవిష్యత్‌లో అల్జీమర్స్‌ వ్యాధి చుట్టుముట్టేందుకు సంకేతమని ఓ పరిశోధన హెచ్చరించింది. ప‌గ‌టి నిద్ర ఏ మాత్రం మంచిది కాదంటున్నారు ప‌రిశోధ‌కులు. పగలు ఎక్కువగా నిద్రపోవడం వల్ల మతిమరుపు (అల్జీమర్స్‌) వచ్చే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.

కాలిఫోర్నియా, శాన్‌ఫ్రాన్సిస్కో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల చేసిన ఓ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. మనల్ని నిద్రపోకుండా ఉంచే మెదడులోని భాగాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. పగలు ఎక్కువగా నిద్రపోయే వారిలో తీసుకున్న ప్రొటీన్లు మెదడుకు చేరడం లేదని గుర్తించారు. ఫలితంగా మనల్ని మెలకువతో ఉంచే నాడీకణాలు చనిపోతున్నట్టు తమ పరిశోధనలో తేలిందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త జోసెఫ్‌ వెల్లడించారు.

అంతిమంగా ఇది అల్జీమర్స్‌కు దారి తీస్తోందన్నారు. ముఖ్యంగా వృద్ధులు పగలు అతిగా నిద్రించడం మంచిది కాద‌ని అంటున్నారు. వారి బ్రెయిన్‌ స్కాన్స్‌ను పరిశీలించగా పగటిపూట నిద్రించని వారితో పోలిస్తే బాగా నిద్రపోయిన వారి మెదడులో అల్జీమర్స్‌ కారకాలు పెరిగాయని స్పష్టం చేశారు. అందుకే ప‌గ‌టి నిద్ర‌పోవ‌డం అంత మంచిది కాద‌ని హెచ్చ‌రిస్తున్నారు ప‌రిశోధ‌కులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version