మళ్లీ మొదటికి వచ్చిన చైనా….అడ్డమైన గడ్డి విచ్చలవిడిగా మార్కెట్ లో

-

ఇటీవల చైనా లోని వూహన్ లో ప్రారంభమైన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కరోనా వైరస్ తో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 24 వేల మృత్యుఘోష నమోదు కాగా, ఇప్పటికే 5 లక్షల కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. చైనా లో పుట్టిన ఈ వైరస్ తో దాదాపు అన్ని దేశాలు కూడా లాక్ డౌన్ ను ప్రకటించినప్పటికీ ఈ వైరస్ మాత్రం కంట్రోల్ అవ్వడం చాలా కష్టంగా మారింది. జంతువుల వల్లే ఈ వైరస్ సోకింది అంటూ నిపుణులు సైతం చెప్పారు. అయితే ఇప్పటికే ఈ కరోనా కారణంగా చైనా లో 3 వేల మందికి పైగా మృతి చెందినప్పటికీ ఏమాత్రం లెక్క చేయకుండా డ్రాగన్ దేశం మళ్లీ మొదటికి వచ్చింది. ఇంకా కరోనా నుంచి పూర్తిగా కోలుకోకుండానే అక్కడి మార్కెట్ లలో విచ్చలవిడిగా అక్కడి మార్కెట్ లలో గబ్బిలాలు,కుక్కలు,ఉడుములు,నెమళ్లు,జింకలు వంటి జంతువులను, పక్షులు సజీవంగా కనిపిస్తున్నాయి. వీటిని బోనుల్లో బంధించి మళ్లీ మార్కెట్ లో విక్రయాలు కొనసాగిస్తున్నారు. కస్టమర్ కావలసినదాన్ని సెలెక్ట్ చేసుకుంటే చంపేసి ముక్కలు కట్ చేసి ఇస్తారు. కరోనా వచ్చిన వూహాన్ మార్కెట్ ఒక్కటే కాదు. వేల సంఖ్యలో చిన్న చిన్న మార్కెట్లు వీధికొకటి కనిపిస్తాయి. కరోనా వచ్చాక ఓ 20 వేల మార్కెట్లయితే మూతపడ్డాయి కానీ.. పరిస్థితి కాస్త సద్దుమణిగితే మళ్లీ యధా మామూలే అయ్యినట్లు తెలుస్తుంది. గతంలో సివిట్ అనే పిల్లి నుంచి సార్స్ అనే వైరస్ వచ్చిందని కొన్నాళ్లు ఆ మార్కెట్ మూతపడింది.

ఇప్పుడు మళ్లీ శుభ్రంగా పిల్లులను అమ్మేసుకుంటున్నారు. ప్రపంచం అంతా ప్రాణాలు అరచేత పట్టుకుని బిక్కుబిక్కు మంటూ నాలుగ్గోడల మధ్య బతికేస్తుంటే.. చైనాలో మాత్రం ఆన్‌లైన్లో వన్యప్రాణుల విక్రయాలు మూడు గబ్బిలాలు, ఆరు ఉడుములుగా సాగుతోందని కొన్ని వార్తా సంస్థలు కూడా వెల్లడిస్తున్నాయి. అలుగు అనే వన్య ప్రాణి నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా అలుగులను విక్రయించే మార్కెట్ చైనాలోనే ఉంది మరి. ఇంత జరుగుతుంటే వాటిపై నిషేధం విధించి కట్టడి చేయొచ్చుగా అని అనేవాళ్లు కూడా లేరు. వచ్చిన చిక్కంతా అక్కడే. చైనీయులు సంప్రదాయా వైద్యానికి అత్యంత ప్రాముఖ్యతను ఇస్తారు. మరి ఆ వైద్యంలో వాడేదంతా జంతువులు, పక్షులకు సంబంధించిన అవయవాలే. దాంతో ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. ఆఖరికి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సైతం. సంప్రదాయ వైద్యశాస్త్రం చైనాకు ఖజానా వంటిదని అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. వైద్యంలో భాగంగానే జంతువుల పచ్చిమాంసం తినడం, వాటి స్రావాలను వాడడం వంటివి చేస్తుంటారు. కోవిడ్ వచ్చినా, కోటి మంది బలైపోయినా చైనాను మాత్రం ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version