పశ్చిమగోదావరి జిల్లాలో వింత వ్యాధి కలకలం రేపుతోంది. ముందుగా ఏలూరులో మొదలై చాలా మందిని వణికించిన వింత వ్యాధి తాజాగా పూళ్లలో కూడా మొదలైంది. అక్కడ ఎందుకు అలా కళ్ళు తిరిగి పడిపోతున్నారు అనే విషయం తెలియకుండానే ఇప్పుడు దెందులూరు మండలంలో కూడా ఈ వ్యాధి కలకలం రేపుతోంది. దెందులూరు మండలం కొమిరేపల్లి గ్రామంలో ప్రజలందరూ ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతున్నారు.
కొమిరేపల్లి గ్రామంలో చాలా మందికి అస్వస్థత చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇది కూడా అంతుచిక్కని వింత వ్యాధిగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కూడా ఏలూరు, పూళ్ల తరహాలో వింత వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ఊరిలో ఇప్పటి దాకా మొత్తం 14 మంది అస్వస్థతకు గురి కాగా వారందరినీ ఏలూరు, గుండుగొలనులోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అసలు దీనికి కారణం ఏమిటి అనేది మాత్రం తెలియడం లేదు.