- సువేందు అధికారికి లీగల్ నోటీసులు పంపిన అధికారి పార్టీ నేత
కోల్‌కతా: బెంగాల్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికి ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇటీవల పార్టీని వీడి కమళం గూటికి చేరిన నేతలతో తృణముల్ ఇరకాటంలో పడుతోంది. ఇక టీఎంసీని వీడిన నేతలను సీఎం మమతపైనే పోరుకు దిగేలా బీజేపీ గట్టిగానే ప్రణాళికలు రచిస్తోంది. దీనికి అనుగుణంగానే పార్టీ మార్గనిర్ధేశంతో కమలం నేతలు ముందుకు సాగుతున్నారు.
అయితే, బీజేపీ కళ్లేం వేయలనుకుంటున్న తృణముల్ గట్టిగానే కమళం నేతలకు బదులిస్తోంది. ఇక ఇటీవల దీదీ పార్టీని వీడి బీజేపీలో చేరిన సువేందు అధికారి.. తృణముల్ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేస్తూ రెచ్చిపోతున్నారు. ఇటీవలే దీదీ పోటీ చేసే స్థానం నుంచే తాను పోటీ చేసి.. 50 వేల ఓట్లతో ఓడిస్తానంటూ దీదీని హెచ్చరించారు. ఇక సువేందు అధికారికి సైలెంట్ చేయడానికి తృణముల్ పరోక్షంగా రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది.
దీనిలో భాగంగానే తాజాగా సువేంద్ అధికారికి.. టీఎంసీ నేత, ఎంపీ అభిషేక్ బెనర్జీ లీగల్ నోలీసులు పంపినట్టు తెలుస్తోంది. బెనర్జీ గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. సువేంద్ అధికారి ఖెజూరీలో మాట్లాడుతూ తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే క్షమాపణలు చేప్పాలని బెనర్జీ డిమాండ్ చేశారు. 36 గంటల్లోగా స్పందించకపోతే క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకుంటామని గట్టిగానే హెచ్చరించారు. సువేందు అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆయనపై ఉన్న పలు క్రిమినల్ కేసులను మరిచిపోయినట్లున్నారన్నారు. శారదా చిట్‌ఫండ్, నారద కేసుల్లో సువేందు నిందుతుడుగా ఉన్నారంటూ వెల్లడించారు.