ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసిపి ఇప్పుడు చాలా వరకు కూడా బలంగానే కనపడుతుంది. అయితే నాయకత్వ లోపం అనేది ఆ పార్టీలో కొన్ని నియోజకవర్గాల్లో ప్రధానంగా ఉంది అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీని కొంతమంది నేతలు మాత్రమే ముందుకు నడిపించారు. మరికొంతమంది నేతలు పార్టీని ముందుకు నడిపించే విషయంలో ఘోరంగా విఫలమయ్యారు.
ఇప్పుడు ఇదే అధికార వైసిపిని ప్రధానంగా కలవరపెడుతున్న అంశం. కొంతమంది నేతలు పార్టీకి ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారు అని ముఖ్యమంత్రి జగన్ కొంతమంది వద్ద నేరుగానే అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొంత మంది మంత్రుల విషయంలో కూడా ఉత్తరాంధ్రలో ఆయన సీరియస్ గానే ముందుకు వెళ్లవచ్చు. ఉత్తరాంధ్ర లో ఉన్న చాలా మంది మంత్రులు పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగానే ఉంటున్నారు.
దీనివలన పార్టీ సంస్థాగతంగా నష్టపోతోంది. అందుకే ఉత్తరాంధ్ర మంత్రుల శాఖలను మార్చే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నట్టుగా సమాచారం. యాక్టివ్ గా ఉండేవాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన భావిస్తున్నారట. ప్రభుత్వంలో యాక్టివ్ గా కనబడే మంత్రులకు శాఖలను అప్పగించి… ఉత్తరాంధ్ర మంత్రులను తప్పించాలని ఆయన ఇప్పటికే పార్టీ నేతల వద్ద అభిప్రాయపడినట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈ విషయంలో ఎంత వరకు ముందడుగు పడుతుంది ఏంటి అనేది చూడాలి. ఒకవేళ ఉత్తరాంధ్రలో సమర్థవంతంగా పనిచేసే ఎమ్మెల్యేలు ఉంటే వాళ్లకు కీలక బాధ్యతలు అప్పగించడానికి జగన్ రెడీగా ఉన్నారు.