ఏపీ కోళ్లపై బ్యాన్ విధించారు. దింతో తెలంగాణ సరిహద్దుల్లో 24 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో మూడు చెక్ పోస్టులు చేశారు. ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను వెనక్కి పంపుతున్నారు అధికారులు.
ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో తనిఖీలు ముమ్మరం చేశారు. రామాపురం ఎక్స్ రోడ్డులోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద ఉన్న అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు, వెటర్నరీ డాక్టర్ల తనిఖీలు జరుగుతున్నాయి. ఆంధ్ర నుంచి సరఫరా అయ్యే కోళ్లకు సంబంధించి వాహనాలను తనిఖీ చేసి వాటిని తెలంగాణలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
బర్డ్ ఫ్లూ ఎఫెక్టు 24 గంటల్లో 10 వేల కోళ్లు మృతి. చెందాయి. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అనుమోలులంకలోని శ్రీ బాలాజీ ఫౌల్ట్రీ ఫామ్ లో భారీగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. చనిపోయిన కోళ్లను జనావాసాలకు దూరంగా డిస్పోజ్ చేయాలని సూచించారు వెటర్నరీ అధికారులు. అధికారుల సూచన మేరకు చనిపోయిన కోళ్లను భూమిలో పూడ్చి పెట్టారు ఫౌల్ట్రీ యజమాని.
బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్: ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో తనిఖీలు ముమ్మరం
రామాపురం ఎక్స్ రోడ్డులోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద ఉన్న అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు, వెటర్నరీ డాక్టర్ల తనిఖీలు
ఆంధ్ర నుంచి సరఫరా అయ్యే… https://t.co/y7azOPR6qu pic.twitter.com/HO62M5n7Ab
— BIG TV Breaking News (@bigtvtelugu) February 12, 2025