పూజల పేరుతో రూ.10 లక్షలు తీసుకుని లేడీ అఘోరీ మోసం చేసిందని, అడిగితే బెదిరిస్తున్నదని ఓ మహిళ మోకిలా పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అఘోరీని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.
అయితే, అఘోరీ అరెస్టుపై ఆమె తరఫు న్యాయవాది బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో బెయిల్ ఎప్పుడు వస్తుందో చెప్పలేమని అన్నారు.చీటింగ్ కేసు కాబట్టి ఏ విధంగా చర్యలు తీసుకుంటారో కూడా చెప్పలేమన్నారు అఘోరీకి పదేళ్లలోపు శిక్ష పడే అవకాశం ఉంటుందని తెలిపారు. తనకు కేసు పేపర్లు మాత్రమే అఘోరీ ఇచ్చిందని..ఎలాంటి విషయాలు చెప్పలేదన్నారు.అఘోరీ న్యాయస్థానాన్ని కూడా తప్పుతోప పట్టిస్తుందని ఆమె తరఫున లాయర్ వెల్లడించారు.