జమ్ము కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా ఖండించారు. పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని పిరికిపందల చర్యగా అభివర్ణించారు. టెర్రరిస్టుల దాడిలో 30 మంది చనిపోవడం, మరికొంత మంది గాయపడటం తీవ్రంగా కలిచి వేసిందని ఆమె పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలకు వైఎస్ షర్మిల ప్రగాఢ సానుభూతిని తెలిపారు.గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ దాడిలో మరణించిన వారిలో ముగ్గురు తెలుగు వాళ్లు ఉండటం అత్యంత బాధాకరమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలబడాలని కోరారు. అలాగే ఉగ్రవాదంపై పోరుకు యావత్ దేశం కలిసి కట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా, అమాయక ప్రజలు ప్రాణాలు పోకుండా కేంద్రం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.